అన్యోన్యతకు పడుకునేముందు ఇవి తప్పనిసరి 1 m ago
హత్తుకుని పడుకునే ఆలుమగల జీవితం ఆనందంగా ఉంటుందని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. అలసిన, తీరిక లేని ఉద్యోగ జీవితంలో నిద్రపోయే ముందు జంటలు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. నిద్ర పట్టకపోతే మొబైల్ కాలక్షేపం, ఎవరికివారు పడుకోవడం అన్యోన్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. త్వరగా పనులు ముగించుకుని పిల్లలతో కలిసి ఒకేసారి పడుకుంటే మనుసువిప్పి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. కబుర్లు చెప్పుకోవడంతో హాయిగా నవ్వుకుని మనసు తేలిక పడుతుంది. చేతల ద్వారా మనం తెలిపే భావాలే..మనసులోని ప్రేమను మన భాగస్వామికి తెలియజేస్తాయి. పడుకునే ముందు ప్రేమగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. భాగస్వాముల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.